తొలిప్రేమ మొదటి వారం కలెక్షన్లివే..!

మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో వచ్చిన తొలిప్రేమ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలిచింది. దర్శకుడిని పలువురు ప్రశంసించారు కూడా..! కేటీఆర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఇక ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగా వచ్చాయి.

ఈ సినిమా పలు ప్రాంతాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు కోట్లలో..
నైజాం-5.40,
సీడెడ్‌-1.70,
నెల్లూరు-0.43,
గుంటూరు -1.14,
కృష్ణా 1.07,
వెస్ట్-0.93,
ఈస్ట్-1.18,
ఉత్తరాంధ్ర 2.15,
కర్ణాటక 1.20,
అమెరికా 2.30,
ఇతర ప్రాంతాల్లో 0.80 వ‌చ్చాయి.
తొలి వారంలో ‘తొలిప్రేమ’ 18.33 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలిప్రేమ తొలి వారం షేర్‌ 14.03 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి ప్రేమ మొత్తం గ్రాస్‌ రూ.34 కోట్లుగా ఉంది. ‘ఫిదా’ సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్న వ‌రుణ్ తేజ్.. ఆ సినిమా త‌రువాత న‌టించిన‌ ఈ ‘తొలిప్రేమ’ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించారు. అయితే చివర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని కొనేసి.. తన సొంత బ్యానర్ మీద విడుదల చేసేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here