మ‌త్స్యాల మార‌ణ‌హోమం: వేల సంఖ్య‌లో చేప‌లు నీటిపై తేలియాడుతూ

చిక్క‌మ‌గ‌ళూరు: క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మ‌గ‌ళూరు జిల్లాలో అనూహ్య సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లా వ‌ర‌ప్ర‌దాయినిగా భావించే హేమావ‌తి న‌దిలో చేప‌లు మృత్యువాత ప‌డ్డాయి. జిల్లాలోని బ‌ణ‌క‌ల్ గ్రామ సమీపంలో హేమావ‌తి న‌దిపై నిర్మించిన రిజ‌ర్వాయ‌ర్‌లో ఈ దృశ్యం క‌నిపించింది.

ఈ గ్రామం గుండా ప్ర‌వ‌హించే న‌దిలో ఒక్క‌సారిగా వేలాది చేప‌లు మ‌రణించాయి. జీవం లేని వేలాది చేప‌లు నదీ ప్ర‌వాహంలో కొట్టుకొచ్చాయి. నీటిపై తేలియాడుతూ క‌నిపించాయి. ఈ ఘ‌ట‌నతో గ్రామీణులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.

న‌దీ జ‌లాల్లో విషాన్ని క‌లిపి ఉంటార‌నే అనుమానాలు త‌లెత్తాయి. చేప‌లు మృత్యువాత ప‌డటంతో చెడు వాసన ఊరు మొత్తాన్ని చుట్ట‌బెట్టింది. జ‌లాలు క‌లుషిత‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు, మ‌త్స్య‌కారులు బ‌ణ‌క‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here