1.46 నిమిషాలు! చెరువులో ముగ్గురు స్నేహితుల‌ మున‌క‌: సెల్ఫీ వీడియోతో వెలుగులోకి

ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులు. రాజ‌స్థాన్ దివేర్ ప్రాంతంలోని గౌరీకుండ్‌లో స్నానం చేయ‌డానికి వెళ్లారు. చెరువులో దిగ‌డానికి ముందు- తాము స్నానం చేస్తోన్న దృశ్యాల‌ను చిత్రీక‌రించ‌డానికి త‌మ మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ మోడ్‌లో ఉంచారు. గౌరీకుండ్‌లో దిగారు. ముగ్గురికీ ఈత రాదు. ఒక‌రిపై ఒక‌రు నీళ్లు చ‌ల్లుకుంటూ చెరువులో దిగారు. ఆద‌మ‌రిచారు.

అంతే! ఒక‌రి త‌రువాత ఒక‌రు చెరువులో లోతైన ప్ర‌దేశంలో ప‌డి మునిగిపోయారు. ఇదంతా- ఆ మొబైల్‌ఫోన్‌లో రికార్డ‌య్యింది. వారిని చేత‌న్‌, సుద‌ర్శ‌న్ ఆలియాస్ బ‌బ్లూ, రాధేశ్యామ్‌గా గుర్తించారు. వారు ముగ్గురూ ఓ శుభ‌కార్యంలో పాల్గొన‌డానికి దేవ్‌గ‌ఢ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని దివేర్‌కు వ‌చ్చారు. చేత‌న్‌, సుద‌ర్శ‌న్‌, రాధేశ్యామ్ తాము గౌరీకుండ్‌కు వెళ్తున్నామ‌ని చెప్పి వెళ్లారు.

ఎంత సేపయిన‌ప్ప‌టికీ.. వారు వెన‌క్కి తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు, స్నేహితులు సంఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లే స‌రికి జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగిపోయింది. గౌరీకుండ్ ఒడ్డున మొబైల్ ఆన్‌లో ఉండ‌టం, వారి బ‌ట్ట‌లు గ‌ట్టుపైనే ఉండ‌టాన్ని చూసి ప్ర‌మాదాన్ని శంకించారు.

కొద్దిసేప‌టికే ముగ్గురి మృత‌దేహాలు తేలియాడుతూ క‌నిపించాయి. దేవ్‌గ‌ఢ్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను వెలికితీశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here