ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకొని లోనికి వచ్చారు.. 500 గ్రాముల బంగారం పట్టుకుపోయారు..!

ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు.. ధరించి జ్యువెలరీ షాప్ లోకి చొరబడ్డారు. అచ్చం సినిమా సీన్ లో లాగా తమ వద్ద ఉన్న మారణాయుధాలతో బెదిరించడం మొదలుపెట్టారు. నిమిషాల వ్యవధిలో ఆ షాప్ ను కొల్లగొట్టి దొరికినదంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఈ దొంగతనంలో మొత్తం అయిదుగురు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు బయటే ఉండగా ముగ్గురు హెల్మెట్లు ధరించి లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. మాచోహళ్లి లోని అమ్మా జ్యువెలరీ షాపులో ఈ దొంగతనం చోటుచేసుకుంది. ప్రతి ఘటించడానికి షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి ప్రయత్నించగా.. అతడిపై కూడా దాడి చేశారు ఆ వచ్చిన డుండగులు. పనిచేస్తున్న వ్యక్తి ఎదురుతిరగడానికి ప్రయత్నిస్తుండగా కొడవలి తీసుకొని ఓ డుండగుడు అతడిపై విసిరేశాడు. దీంతో ఆ వ్యక్తికి గాయమైంది. మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తం 500 గ్రాముల బంగారం ఎత్తుకుపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here