గుప్త‌నిధుల కోసం మ‌ళ్లీ..మ‌ళ్లీ! ఈ సారి న‌ర‌బ‌లి!

పెద్ద‌ప‌ల్లి: గుప్త నిధుల కోసం న‌ర‌బ‌ల్లి ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు కొంద‌రు దుర్మార్గులు. చివ‌రి నిమిషంలో ఈ విష‌యం బట్ట‌బ‌య‌లైంది. నిందితుల‌ను ఎలాంటి ప్రాణ‌న‌ష్టం లేకుండా పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేయ‌గ‌లిగారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని పెద్ద‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని కాల్వశ్రీ‌రామ్‌పూర్ మండ‌లంలోని సుంక‌రికోటలో గుప్త నిధులు ఉన్నాయ‌నే విష‌యం ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. గ‌తంలోనూ కొంద‌రు ఇక్క‌డ త‌వ్వ‌కాలు సాగించారు. అవేవీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు.

కొద్దిరోజులుగా మ‌ళ్లీ ఈ కోట‌లో త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు నిందితులు. ఎంత‌గా త‌వ్వ‌కాలు సాగించిన నిధి మాత్రం చేతికి అంద‌క‌పోవ‌డంతో.. న‌ర‌బ‌లి ఇవ్వాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వ‌డానికి ప్ర‌యత్నించారు. గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేసి, రమేశ్‌ అనే యువకుడిని బలి ఇవ్వ‌డానికి విశ్వ ప్ర‌యత్నాలు చేశారు. వారి కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు.

ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు ఉరుకులు, ప‌రుగుల మీద సుంక‌రి కోటకు వెళ్లారు. అప్ప‌టికీ వారింకా అక్క‌డే ఉండ‌ట‌తో దేహ‌శుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

త‌న‌కు మ‌ద్యం అల‌వాటు ఉంద‌ని, మ‌ద్యం తాగించి త‌న‌ను సుంక‌రి కోట‌కు తీసుకొచ్చార‌ని ర‌మేశ్ చెబుతున్నాడు. కోట వ‌ద్ద‌కు తీసుకొచ్చిన త‌రువాత త‌నకు అస‌లు విష‌యం తెలిసింద‌ని, త‌ప్పించుకుని పారిపోయి వ‌చ్చాన‌ని అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here