పులి, ఎలుగుబంటి కొట్లాడుకుంటే ఏది గెలుస్తుందంటూ వెంటాడే ప్ర‌శ్న‌కు స‌మాధానం..

ముంబై: పులి, ఎలుగుబంటి కొట్లాడుకుంటే ఎవ‌రు గెలుస్తార‌నే ప్ర‌శ్న చిన్న‌ప్ప‌టి నుంచి మ‌న‌ల్ని వెంటాడుతున్నదే. దానికి స‌రైన స‌మాధానం చెప్ప‌డానికి త‌డుముకోవాల్సి వ‌చ్చేంది. పులి గెలుస్తుందంటే దానికి కార‌ణాలు మ‌న‌కు తెలియ‌వు.

పోనీ- ఎలుగుబంటి గెలుస్తుంద‌ని అడ్డంగా వాదించినా స‌రైన కార‌ణం చెప్ప‌లేం. తాజాగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న ఈ వీడియో మాత్రం దీనికి స‌మాధానం చెబుతోంది..ఎలుగుబంటే గెలుస్తుంద‌ని.

మ‌హారాష్ట్ర చంద్రాపూర్‌లోని త‌డోబా అంధారి పులుల అభ‌యార‌ణ్యంలో చోటు చేసుకున్న పోరు ఇది. ఈ అభ‌యార‌ణ్యం పులులకు పెట్టింది పేరు.

ఓ పులి, ఎలుగుబంటి మధ్య సాగిన భీక‌ర పోరు ఇది. అభ‌యార‌ణ్యంలోకి స‌ఫారీకి వెళ్లిన సంద‌ర్శ‌కులు దీన్ని త‌మ సెల్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ పోరులో ఎలుగుబంటే గెలిచింది. దాని ధాటికి పులికి తోక ముడ‌వ‌టం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here