అరుదైన ఈ పాము కోసం పోలీసులు ఏం చేశారో తెలిస్తే..

మెల్‌బోర్న్‌: అత్యంత అరుదైన టైగ‌ర్ జాతికి చెందిన పాము అది. ఎలా వ‌చ్చిందో గానీ.. ర‌ద్దీ రోడ్డు మీదికి వ‌చ్చింది. వాహ‌నాలు ర‌య్‌మంటూ దూసుకెళ్తోంటే భ‌యం, భ‌యంగా రోడ్డుకు ఓ వార‌గా ముడుచుకుని క‌నిపించింది.

దీన్ని చూసిన ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా? వెంట‌నే రోడ్డు మొత్తాన్నీ స్తంభింప‌జేశారు. వాహ‌నాల‌ను ఎక్క‌డిక‌క్క‌డే వేరే మార్గాల్లోకి మ‌ళ్లించారు. అటూ, ఇటూ ఓ వంద మీట‌ర్ల వ‌ర‌కూ ఎలాంటి వాహ‌న‌మూ రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

అనంత‌రం.. పాముల సంర‌క్ష‌కుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పాముల సంర‌క్ష‌కుడు దాన్ని భ‌ద్రంగా తీసుకెళ్లి స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు.

ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో పాములు చాలా అంటే చాలా ఎక్కువ‌. దాదాపు అన్ని జాతుల పాములూ ఆస్ట్రేలియాలో క‌నిపిస్తాయి.

మెల్‌బోర్న్‌లోని అత్యంత ర‌ద్దీ మార్గాల్లో ఒక‌టైన స్పెన్స‌ర్స్ అండ్ కొల్లిన్స్ స్ట్రీట్ క‌నిపించిందీ టైగ‌ర్ జాతికి చెందిన పాము.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here