గజల్ శ్రీనివాస్ గదిలో ఆమె కెమెరా ఎలా పెట్టిందంటే..!

గజల్ శ్రీనివాస్.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన వ్యక్తి. అడ్డంగా దొరికిపోయాడు. ఓ మహిళను వేధిస్తూ దొరికిపోయాడు. అయితే ఆమె అక్కడ కెమెరా ఎలా ఫిక్స్ చేసిందో.. ఎంత సమయం పట్టిందో ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి తనకు వారం రోజులు పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది. గత డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. నేను ఫిర్యాదు చేసినట్టు ఎవరికీ చెప్పలేదు. డబ్బు కోసం నేను ఫిర్యాదు చేయలేదు. డబ్బును ఆశించే దానినైతే పార్వతిలా నేనూ తప్పు చేసేదాన్ని.

గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు వెనుక ఏ వర్గమూ లేదని కూడా చెప్పింది. మొత్తం 15 వీడియోలను పోలీసులకు ఇచ్చానని ఆమె చెప్పింది. ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి వారం రోజులు పట్టిందని బాధితురాలు తెలిపింది. ఎన్నోసార్లు ప్రయత్నించాక వీడియో రికార్డు చేయడం సక్సెస్ అయిందని.. వీడియోల్లో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని బాధితురాలు చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here