5000 సంవత్సరం నుండి వచ్చానని చెప్పిన వ్యక్తి.. ఫోటోలలో భయంకరమైన విషయాలు..!

ఇప్పుడు మనం ఏ సంవత్సరం లో ఉన్నాం.. 2018.. తాను 5000 సంవత్సరం నుండి వచ్చానని ఓ వ్యక్తి చెబుతున్నాడు. అలాగే మానవాళికి త్వరలో అతిపెద్ద ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరించాడు. తన పేరును ఎడ్వర్డ్ అని చెప్పుకొచ్చాడు. 2004లో ఏర్పాటు చేసిన టాప్-సీక్రెట్ ప్రయోగంలో తాను పాలుపంచుకున్నానని ఎడ్వర్డ్ చెప్పుకొచ్చాడు. ఆ ప్రయోగం ద్వారానే తాను టైమ్ ట్రావెలర్ అయ్యానని 5000 సంవత్సరం లోకి వెళ్ళి వచ్చానని చెప్పుకొచ్చాడు.

అప్పుడు భూమి ఎలా ఉందో కూడా అతడు కొన్ని ఫోటోలను చూపించాడు. లాస్ ఏంజెల్స్ కు సంబంధించిన ఓ ఫోటోను అతడు చూపించాడు. ఆ ఫోటోలలో అమెరికా నగరం అయిన లాస్ ఏంజెల్స్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అప్పటికి భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోవడంతో మనుషులు చెక్కతో చేసిన వాటిపై జీవిస్తాడని చెప్పాడు. తాను దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు.

గత వారం నోవా అనే వ్యక్తి కూడా తాను 2030 నుండి వచ్చానని చెప్పుకొచ్చాడు. అతడు కూడా చాలా విషయాలను మీడియాతో చెప్పాడు. అయితే వీళ్ళు చెబుతోంది మాత్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెను మార్పులు వస్తాయని..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here