వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చినా వెళ్లారు..ఇక వెన‌క్కి రాలేదు!

గోవా. అంద‌మైన తీర ప్రాంతాల‌కు నిల‌యం. సూర్య‌ద‌యం, సూర్యాస్త‌మ‌యాల‌ను తిల‌కించ‌డానికి క‌న్యాకుమారి వ‌ర‌కూ వెళ్లలేని ప‌ర్యాట‌కులు గోవాను ఎంచుకుంటారు. దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల స్వ‌ర్గ‌ధామం గోవా. సంవ‌త్స‌రం పొడ‌వునా ప‌ర్యాట‌కుల‌తో అల‌రారుతుంటాయి అక్క‌డి బీచ్‌లు. అంద‌రిలాగే- గోవా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు త‌మిళ‌నాడుకు చెందిన కొంద‌రు యువ‌తీ యువ‌కులు.

అక్క‌డి బేగా బీచ్ వారిని ఆక‌ర్షించింది. స‌ముద్రానికి ఆనుకుని కొన్ని రాళ్ల గుట్ట‌లు ఉంటాయి అక్క‌డ‌. వాటి మీద నిల్చుని, సెల్ఫీలు, ఫొటోలు దిగేవారి సంఖ్య త‌క్కువేమీ కాదు. త‌మిళ‌నాడు యువ‌తీ, యువ‌కులు కూడా ఆ రాళ్ల గుట్టల మీద నిల్చుని ఫొటోలు దిగుతుండ‌గా.. ఓ అల దూసుకొచ్చింది. ముగ్గుర్ని త‌న‌తో పాటు స‌ముద్రంలోకి లాక్కెళ్లింది. ఆ రాళ్ల గుట్ట మీద అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంత‌కుముందే- స్థానిక సిబ్బంది వారిని హెచ్చ‌రించారు.

దీన్ని వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీని ఫ‌లితం- మ‌ర‌ణం. సుమారు గంట త‌రువాత రెండు మృత‌దేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. మ‌రొక‌రి మృత‌దేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై క్యాల‌న్‌గూట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మృతుల్లో ఒక‌రిని మాత్ర‌మే గుర్తించారు. అత‌ని పేరు శ‌శికుమార్ వాస‌న్‌. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను గోవా వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here