హెల్మెట్ పెట్టుకుని ఆర్టీసీ బ‌స్సు న‌డిపాడు..అతి జాగ్ర‌త్త‌ప‌రుడ‌ని అనుకుంటే పొర‌పాటే!

సాధార‌ణంగా టూ వీల‌ర్ న‌డిపేట‌ప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. బ‌స్సులు, కార్ల‌ను న‌డిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకుంటుంటారు. ఇది నిబంధ‌న‌. మ‌రి! ఈ డ్రైవ‌ర్ మాత్రం బ‌స్సును న‌డిపిస్తూ కూడా హెల్మ‌ట్ పెట్టుకున్నాడు.

అలాగ‌ని- అతి జాగ్ర‌త్తప‌రుడ‌నుకుంటే పొర‌పాటే. దీనికో కార‌ణం ఉంది. ఆ బ‌స్సు త‌మిళ‌నాడు ఆర్టీసీకి చెందిన‌ది. ఆ డ్రైవ‌ర్ పేరు శివ‌కుమార్‌. త‌మిళ‌నాడు ఆర్టీసీ డ్రైవ‌ర్‌.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సుల బంద్ న‌డుస్తోంది. ఈ బంద్ అయిదోరోజుకు చేరుకుంది. స‌రైన ర‌వాణా వ‌స‌తి లేక ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు.

ఈ క్ర‌మంలో.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొంద‌రు కాంట్రాక్టు ఉద్యోగుల చేతికి బ‌స్సుల‌ను ఇచ్చి రోడ్డు మీదికి పంపిస్తోంది.

 

 

ఇలా రోడ్డు మీదికి వ‌చ్చిన ఆర్టీసీ బ‌స్సుల‌ను స‌మ్మెలో ఉన్న ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. రాళ్ల‌తో దాడులు కూడా చేస్తున్నారు. ఆ దాడుల నుంచి త‌ప్పించుకోవ‌డానికే ఈ ఉపాయం. ఈ దృశ్యం త‌మిళ‌నాడులోని ఈరోడ్‌లో క‌నిపించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here