సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారిన మ‌న మాయాబజార్ ఫొటో! థ్యాంక్స్ టు సీఎం

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటో అచ్చంగా మాయాబ‌జార్‌లోనిదే. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు ఎన్టీ రామారావుతో పాటు సావిత్రి, గుమ్మ‌డి త‌దిత‌రులంతా మాయా పెట్టెను ఆస‌క్తిక‌రంగా చూస్తోన్న ఈ పిక్‌.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట‌ర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది.

 

ఎప్పుడో తీసిన మాయాబ‌జార్ సినిమాలోని ఈ ఫొటో ఇప్పుడెందుకు వైర‌ల్‌గా మారింద‌నే అనుమానం రావ‌చ్చు. దీనికి కార‌ణం.. త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్‌కుమార్ దేవ్‌. ఎక్క‌డి ఏపీ, ఎక్క‌డి త్రిపుర.. ఈ రెంటికీ లింక్ ఎలా కుద‌రింద‌నేగా అనుమానం?

మ‌హాభార‌త కాలంలోనూ ఇంట‌ర్‌నెట్‌, శాటిలైట్లు ఉండేవ‌ని అంటూ విప్ల‌వ్‌కుమార్ దేవ్ చేసిన కొన్ని కామెంట్స్‌.. మ‌న మాయాబ‌జార్ చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది. `విప్ల‌వ్‌కుమార్ దేవ్ చెప్పింది నిజ‌మే..కావాలంటే ఈ పిక్ చూడండి అంటూ నెటిజ‌న్లు ఈ ఫొటోను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. మ‌హాభార‌త కాలంలోనే ల్యాప్‌టాప్‌ల‌ను వాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

అంతఃపురంలో కూర్చున్న సంజ‌యుడు మ‌హాభార‌త యుద్ధాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా ల్యాప్‌టాప్ ద్వారా ధృత‌రాష్ట్రునికి వివ‌రించే వాడని చెబుతున్నారు. మాయాబ‌జార్‌ను గుర్తు చేసిన త్రిపుర ముఖ్య‌మంత్రికి మ‌నం ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అంటున్నారు నెటిజ‌న్లు. ఎంతైనా మ‌న కేవీ రెడ్డి గారికి స‌లాం చెప్పాల్సిందే. భ‌విష్య‌త్తులో ఇలాంటి ప‌రిక‌రాలు వ‌స్తాయ‌ని 1957లోనే ఊహించేశారాయ‌న‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here