నిహారిక‌తో ప్రేమ‌, పెళ్లిపై నాగశౌర్య క్లారిటీ!

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు కుమార్తె, న‌టి నిహారిక పెళ్లిపై పుకార్లు చెల‌రేగ‌డం ఇది రెండోసారి. మొద‌ట్లో నిహారిక‌.. హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ను పెళ్లాడ‌బోతోంద‌నే టాక్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది.

అది కాస్తా స‌ద్దుమ‌ణిగిన వెంట‌నే ఇంకో టాక్ బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇప్పుడిప్పుడు టాలీవుడ్‌లో నిల‌దొక్కుకుంటున్న హీరో నాగశౌర్య‌ను నిహారిక పెళ్లి చేసుకోనుంద‌నే వార్త గుప్పుమంది.

మొద‌ట్లో అటు నాగ‌శౌర్య గానీ, ఇటు మెగా కాంపౌండ్ గానీ ఈ వార్త‌ల‌పై ఎలాంటి స్పంద‌నా వ్య‌క్తం చేయ‌లేదు. దీనితో అది నిజ‌మ‌ని న‌మ్మే ప‌రిస్థితి వ‌చ్చింది.

దీనితో నాగ‌శౌర్యే మొద‌ట‌గా ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేశాడు. నిహారిక డెబ్యూ మూవీ `ఒక మ‌న‌సు` హీరో నాగ‌శౌర్య‌. ఆ సినిమా నుంచే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని, ఇక పెళ్లేనంటూ టాక్ వినిపించింది.

నిహారికతో ప్రేమ లేదు.. పెళ్లీ లేద‌ని కొట్టిపారేశాడ‌త‌ను. ఒక్క‌ నిహారికతోనే కాద‌ని, ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఏ హీరోయిన్‌తోనూ ఎలాంటి ప్రేమ వ్య‌వ‌హారాలు లేవ‌ని చెప్పాడు.

తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇంకో నాలుగేళ్లు పెళ్లి చేసుకునే ప్ర‌స‌క్తే లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. త‌న‌ అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు.

నాగశౌర్య న‌టించిన తాజా చిత్రం `ఛలో`. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి గెస్ట్‌గా వ‌చ్చారు. అదే ఈ పుకారుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here