రావు గోపాల్ రావు సతీమణి కమలా కుమారి కన్నుమూత..!

దివంగత దిగ్గజ నటుడు రావు గోపాల్ రావు సతీమణి, నటుడు రావు రమేష్ తల్లి కమలా కుమారి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాసను విడిచారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి పొజిషన్ లో ఉన్నారు.

స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన కమలా కుమారికి.. రావు గోపాల్ రావు కూడా ఓ నాటకంలో పరిచయం అయ్యారు. ఆ తరువాత ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. రావు గోపాల్ రావు మరణం తరువాత కూడా ఆమె ఎన్నో నాటకాలలో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here