శ్రీ‌రెడ్డిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చి, వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారిన వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డిలో ఓ కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూడ‌న‌టువంటిదేన‌ని అనుకోవ‌చ్చు. ఇంత‌వ‌ర‌కు కూడా ఆమె అల‌వోక‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ, అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, శేఖ‌ర్ కమ్ముల, ద‌గ్గుబాటి సురేష్‌.. వంటి బిగ్‌షాట్స్‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగించారు. మ‌న‌కు తెలిసిన శ్రీ‌రెడ్డి వైఖ‌రి ఇది. దీనికి పూర్తి భిన్న‌మైన కోణంలో ఆమెలో క‌నిపించింది. అదే మాన‌వీయ‌త‌, మాన‌వ‌త్వం.

ఆదివారం ఆమె హైద‌రాబాద్‌లోని ఓ వృద్ధాశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఆ ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం పొందుతున్న వృద్ధుల‌ను క‌లిశారు. చాలాసేపు వారితో ముచ్చ‌టించారు. ఆర్థిక స‌హాయాన్ని అందించారు.

`క‌లిసొచ్చే కాలానికి న‌డిచి వ‌చ్చే కూతురిగా వారు న‌న్ను ఆద‌రించారు. ఇంత‌మంది అమ్మ‌ల వ్య‌ధ‌లు విన్న వేళ నా క‌న్నులు గోదారి అయి, బావురుమ‌న్నాను. అనాదిగా ఆడ‌ది అమ్మ‌, భార్య‌, అత్త‌, చెల్లెలు, కోడ‌లు రూపం. ఏదైనా బాధ ఆడ‌దానికే. ఆడ‌దంటే త‌ర‌త‌రాలుగా అదే చుల‌క‌న భావం. ఈ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చాలా మంది కొడుకులు అక్క‌ర్లేదని వ‌దిలేసిన త‌ల్లిదండ్రులు దొరికారు. వాళ్ల‌కో మ‌రి? క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కూతురు వ‌చ్చింది..` అని ట్వీట్ చేశారు. శ్రీ‌రెడ్డి తీసుకున్న ఓ చిన్న స్టెప్‌.. ప్రశంసలు అందుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here