టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌: సీనియర్‌ నటుడు, డబ్బింగ్ క‌ళాకారుడు చంద్రమౌళి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయ‌న వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెం ఆయ‌న స్వ‌గ్రామం.

 

సినిమాలపై ఆసక్తితో 1971లో చంద్రమౌళి మద్రాసు వెళ్లి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు 200 సినిమాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రలకే పరిమిత‌మైన‌ప్ప‌టికీ.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

 

1971లో ‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో ఆయ‌న‌ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా నేటి అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here