లైవ్‌ షోలో బాలిక ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన టాప్ సింగర్‌: కేసు న‌మోదు

న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే లైవ్ షో అది. బాల, బాలిక‌ల పాట‌ల ప్రోగ్రామ్‌. దాని పేరు `ది వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్ సీజ‌న్‌-2`. హోలీ పండుగ‌ను దృష్టిలో పెట్టుకుని `రంగ్ బ‌ర్‌సే` పేరుతో ప్ర‌త్యేకంగా బాల గాయ‌నీ, గాయ‌కుల మ‌ధ్య పాట‌ల పోటీల‌ను ఏర్పాటు చేశారు.

టాప్ బాలీవుడ్ సింగ‌ర్లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు షాన్‌, హిమేష్ రేష‌మ్మియా, అస్సామీ గాయ‌కుడు ప్యాప‌న్ ఆలియాస్ అంగ‌ర‌గ్ ప్యాప‌న్ మ‌హాపాత్ర దీన్ని హోస్ట్ చేస్తున్నారు. న్యాయ నిర్ణేతులుగా ఉంటున్నారు.

మంగ‌ళ‌వారం ఫేస్‌బుక్ పేజ్ లైవ్‌లో రంగ్ బ‌ర్‌సే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో గాయ‌కుడు ప్యాప‌న్ ఓ బాల గాయ‌ని ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఫిర్యాదులు అందాయి.

లైవ్‌లో అత‌ను ఓ బాల గాయ‌నిని అభ్యంత‌ర‌కరంగా ముద్దు పెట్టుకున్నాడ‌ని సుప్రీంకోర్టు అడ్వొకేట్ రునా భుయాన్ ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

ఆయ‌న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్యాప‌న్‌పై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here