మెగా హీరో ట్వీట్ చేసిన పిక్‌! టాప్ డైరెక్ట‌ర్లంద‌రూ ఒకే చోట‌! ఎందుకు క‌లిశారంటే!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వారంద‌రూ ఒక‌ర్ని మించిన వారొక‌రు. తాము ఈ సినిమా తీశాం అని గ‌ర్వంగా చెప్పుకోగ‌ల ద‌ర్శ‌కులు. ప్ర‌స్తుతం తెలుగు తెర‌ను ఏలుతున్న ద‌ర్శ‌కులు వారు. సుకుమార్‌, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, సందీప్ వంగా, ఎస్ ఎస్ రాజ‌మౌళి, వంశీ పైడిప‌ల్లి, నాగ్ అశ్విన్‌, కొర‌టాల శివ‌, అనిల్ రావిపూడి, హ‌రీష్ శంక‌ర్ ఒకేచోట క‌లిశారు. ఈ ఫొటోను మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. వీళ్లంద‌రూ ఒకేచోట క‌లిశారు. పెద్ద విశేష‌మేమీ కాదు గానీ.. సుకుమార్‌, వంశీ పైడిప‌ల్లి జాయింట్‌గా డిన్న‌ర్ ఏర్పాటు చేశారు. త‌మ తోటి ద‌ర్శ‌కులంద‌ర్నీ దీనికి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటో ఇది. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను భ‌లేగా ఆక‌ట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here