టొరంటో ట్రక్కు దాడి.. 10 మంది మృతి..!

టొరంటోలో ట్రక్కు దాడి చోటుచేసుకుంది. అద్దెకు తీసుకొని వచ్చిన ఓ వ్యాన్ తో పాదచారుల మీదకు దూసుకొని వెళ్ళాడు. దీంతో 10 మంది అక్కడికక్కడే మరణించగా 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. టొరంటోలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం పాటూ ఆ వ్యక్తి తన ట్రక్కుతో పాదచారుల మీదకు దూసుకొని వెళ్ళాడు. కెనడియన్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పోరేషన్ ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తిని అలెక్ మినస్సియన్ అనే 25 ఏళ్ల వ్యక్తిగా గుర్తించింది.

మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలెక్ కు ఎటువంటి మిలిటెంట్ గ్రూపులతో సంబంధం లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అలెక్ ను ఘటనాస్థలికి కొద్ది దూరంలో అరెస్ట్ చేశారు. అయితే అతడు ఎందుకు ఈ పని చేశాడు అన్న ప్రశ్నకు వాళ్ళ వద్ద సమాధానం లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు మాత్రం అతడు కావాలనే ఇలా చేశాడని చెబుతున్నారు. ఇన్వెస్టిగేషన్ కు చాలా సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here