ఇంటి నిండా తాబెళ్ళే.. 10వేలకు పైగా ఉన్నాయి..!

10,000 తాబేళ్లు.. ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నాయి.. ఇవన్నీ ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ లో ఉన్నాయి. మడగాస్కర్ లో ఇలా ఓ ఇంట్లో తాబేళ్లు కనిపించాయి. విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో అందులో ఏమున్నాయో చూద్దామని కొందరు వెళ్ళారు. అంతే.. అందులో ఏమున్నాయో చూసి షాక్ తిన్నారు. కనీసం కాళ్ళు కూడా పెట్టడానికి స్థలం లేకుండా మొత్తం ఇంటి నిండా తాబెళ్ళే ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు.. జంతు సంరక్షణా సంస్థలకు సమాచారం అందించారు.

ఒక్క హాల్ లోనే కాకుండా.. చివరికి బాత్ రూమ్ లో కూడా ఈ తాబేళ్లు ఉన్నాయి. ఒక దాని మీద ఒకటి అలా ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. అవి తమ కాలకృత్యాలు కూడా అక్కడే తీర్చుకోవడంతో చివరికి గది మొత్తం ఎంతో దుర్గందంతో నిండిపోయాయి. అక్కడ మొత్తం 9888 బ్రతికి ఉన్న తాబేళ్లు ఉన్నాయి. 180 దాకా చనిపోయి ఉన్నాయి. ఇవి చాలా అరుదైన తాబేళ్లు అని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here