త‌ప్ప తాగి..తూలిపోతూ..వాలిపోతూ..పోలీసుల‌తోనే గొడ‌వ ప‌డుతూ!

హైద‌రాబాద్‌: ప‌్ర‌తి రోజూ రాత్ర‌యితే చాలు ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎన‌లైజ‌ర్ల‌తో రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డితే భారీగా పెనాల్టీలు వేస్తున్నారు. కార్ల‌ను సీజ్ చేస్తున్నారు. వీఐపీల‌నూ వ‌ద‌లిపెట్ట‌ట్లేదు.

ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. మందుబాబులు ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌న‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ ఈ ఘ‌ట‌న‌. శుక్ర‌వారం రాత్రి నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ ప‌దుల సంఖ్య‌లో మందుబాబులు పోలీసుల చేతికి చిక్కారు.

వెరైటీ ఏమిటంటే.. తాము మందు కొట్ట‌డ‌మే కాకుండా పోలీసుల‌నూ కొట్ట‌బోయారు. వారితో వాగ్వివాదానికి దిగారు. గొడ‌వ పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్‌లో స‌హా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఇవి.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు యువకులు పోలీసులకు చుక్కలు చూపారు. ఓ యువతి ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా పారిపోవ‌డానిక్కూడా ప్రయత్నించింది. ఆమె మ‌ద్యం సేవించిన‌ట్లు తేలడంతో కేసు నమోదు చేశారు.

ఆమె కారును సీజ్‌ చేశారు. మరోవైపు కొందరు యువకులు మద్యం సేవించి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడటమే కాకుండా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

ట్రాఫిక్‌ పోలీసులను పరుష పదజాలంతో దూషించారు.తనిఖీల్లో భాగంగా ఎనిమిది కార్లు, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here