ర‌ద్దీ మార్గంలో భారీ నాగుపాము..స్తంభించిన ట్రాఫిక్‌!

రోడ్డు మ‌ధ్య చుట్ట చుట్టుకుని తీరిగ్గా కునుకు తీస్తూ క‌నిపించిందో నాగుపాము. అల్లంత దూరం నుంచే ఆ పామును చూసిన వాహ‌న‌దారులు బెంబేలెత్తారు. ఆ పాముకు కొంత దూరంలోనే వాహ‌నాల‌ను ఆపివేశారు. కార్లు, లారీ వంటి వాహ‌నాలు కూడా ఆగిపోవ‌డం విచిత్రం అనిపించేదే.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని య‌శ్వంత్‌పుర స‌మీపంలో చోటు చేసుకుంది. య‌శ్వంత్‌పుర జంక్ష‌న్-గొర‌గుంట పాళ్య మ‌ధ్య మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్ట‌రీ స‌మీపంలో ఓ చిన్న బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కింద క‌నిపించిందీ నాగుపాము. అద‌స‌లే ర‌ద్దీ మార్గం.

ఎలా వ‌చ్చిందో గానీ.. న‌డి రోడ్డు మీద చుట్ట చుట్టి క‌నిపించింది అది. పామును చూడ‌గానే బిత్త‌ర‌పోయిన వాహ‌న‌దారులు ముందుకు వెళ్ల‌లేక‌పోయారు. కొద్దిసేప‌టి త‌రువాత బ‌ద్ధ‌కంగా క‌దులుతూ రోడ్డు వార‌గా వెళ్లింది. దీనితో ఊపిరి పీల్చుకున్న వాహ‌న‌దారులు దాని మీద ఓ క‌న్నేసి, ముందుకెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here