వీళ్ళను చూసి మనవాళ్ళు చాలా.. చాలా.. నేర్చుకోవాలి..!

అంబులెన్స్.. ప్రాణాలు నిలబెట్టే వాహనం.. మన వాళ్ళు అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి కూడా ఎందుకో తెగ బాధపడిపోతూ ఉంటారు. అంతెందుకు.. కొందరు అయితే అంబులెన్స్ కోసం వదిలే దారిలో కూడా అడ్డు తగులుతూ ఉంటారు. తమ వారికి ఎప్పుడైనా ఏమైనా అయితే కానీ తెలీదు.. వాళ్లకు.

కానీ మీరు చూడబోయే వీడియోలో ఆ వాహనదారులు చేసిన పనిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. భారీ రద్దీగా ఉండే టన్నెల్ లో అందరూ ఒక్కసారిగా వాహనాలను పక్కకు జరిపి అంబులెన్స్ కు దారిచ్చారు. చైనాలోని జిన్హువా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ వస్తోందని తెలుసుకున్న వాహ‌న‌దారులు త‌మ కార్ల‌ను ఎక్కడికక్కడ ఆపేసి, అంబులెన్స్ కు చాలా చాక‌చ‌క్యంగా దారి ఇచ్చారు. దీంతో రోగిని ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఈ ఘటన చూస్తే వాళ్ళనుండి మనవాళ్ళు ఎంతో నేర్చుకోవాలి అని అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here