ఇంకెక్క‌డా స్థ‌లం దొర‌క‌లేదేమో! లేడీస్ టాయ్‌లెట్‌లో ప‌ని కానిచ్చేసిన‌ ట్రాఫిక్ కానిస్టేబుల్‌!

మైసూరు: లేడీస్ టాయ్‌లెట్‌కు వెళ్లొచ్చిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. క‌ర్ణాట‌క‌లోని మైసూరులో చోటు చేసుకుంది. మూత్ర విస‌ర్జ‌న కోసం ఆయ‌న మ‌హిళ‌ల టాయ్‌లెట్‌ను వినియోగించుకున్నారు. ఆ కానిస్టేబుల్ టాయ్‌లెట్ లోప‌ల ఉన్నాడ‌నే విష‌యాన్ని తెలుసుకుని.. అత‌ను వ‌చ్చేంత వ‌ర‌కూ మ‌హిళ‌లు బ‌య‌టే ఉండాల్సి వ‌చ్చింది.

అత‌ణ్ణి మైసూరు రూర‌ల్ బ‌స్‌స్టేష‌న్ వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. టాయ్‌లెట్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత అక్క‌డే నిల్చున్న కొంద‌రు మ‌హిళ‌ల‌ను బెదిరించారు కూడా. ఈ త‌తంగాన్ని అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్ కెమెరాలో బంధించారు. దాన్ని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here