ప్రేమికుల రోజున పుట్టింది ఈ హీరోయిన్.. నిజమైన ప్రేమ దొరక్క చివరికి..!

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరంటే మధుబాల అనే చెప్తారు.. 14 ఫిబ్రవరి 1933న మధుబాల జన్మించింది.ప్రేమికుల దినోత్సవం రోజునే జన్మించిన మధుబాల జీవితాంతం అసలైన ప్రేమ కోసం ఎదురుచూసింది. ఆమె అసలు పేరు జాహిదా.. నిజమైన ప్రేమ కోసం తన జీవితాంతమంతా ఎదురుచూసింది. మధుబాల తన ఇంటర్వ్యూలో ఒక్క దిలీప్ కుమార్ మాత్రమే కాదు తనను కిషోర్ కుమార్ కూడా మోసం చేశాడని చెప్పింది.

మధుబాల మొదట దిలీప్ కుమార్ ను ప్రేమించింది. వారిద్దరూ ‘నయా దౌర్’ అనే సినిమాలో నటించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆ సినిమాను బి.ఆర్.చోప్రా తెరకెక్కించబోయారు. అయితే అనుకోకుండా షూటింగ్ లొకేషన్ ను గ్వాలియర్ కు మార్చారు. ఇది మధుబాల తండ్రికి నచ్చలేదు. దీంతో మధుబాలతో తీసుకున్న అడ్వాన్స్ వెనక్కు ఇప్పించేసి.. సినిమాను క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు. తండ్రి చెప్పినట్లు మధుబాల చేసింది. అప్పటికే దిలీప్ కుమార్ తో మధుబాల కు ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందట. ఈ విషయమై సర్ది చెప్పడానికి చోప్రా దిలీప్ కుమార్ ను పంపించారు. అయితే తండ్రి మాటే ఫైనల్ అని మధుబాల తేల్చి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత చోప్రా కేసు వేయడంతో దాదాపు ఒక సంవత్సరం పాటూ కేసు కోర్టులో నడిచింది. అలాగే దిలీప్.. మధుబాల మధ్య దూరం కూడా పెరుగుతూ వెళ్ళింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ పెళ్ళి చేసుకోవాలని మధుబాలను కోరాడు. అందుకు మధుబాల తన తండ్రికి క్షమాపణలు చెబితేనే పెళ్ళి అని తేల్చి చెప్పింది. కానీ దిలీప్ కుమార్ క్షమాపణలు చెప్పకపోవడంతో వారి పెళ్ళి జరగలేదు. మధుబాల చివరి రోజుల్లో కూడా దిలీప్ కుమార్ నే ప్రేమించిందని మధుబాల సోదరి తెలిపింది.

ఇక మధుబాల జీవితంలో కిషోర్ కుమార్ వచ్చారో.. కిషోర్ కుమార్ జీవితంలోకి మధుబాల వచ్చిందో ఇప్పటికీ చాలా మందికి తెలీదు. మధుబాల అనారోగ్యం కారణంగా లండన్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న సమయంలో కిషోర్ కుమార్ మధుబాలను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దిలీప్ కుమార్ మీద కోపంతో కిషోర్ కుమార్ తో పెళ్ళికి ఓకే చెప్పేసింది మధుబాల. 27సంవత్సరాల మధుబాల 1960లో కిషోర్ కుమార్ ను పెళ్ళి చేసుకుంది. మధుబాలను పెళ్ళి చేసుకోడానికి కిషోర్ కుమార్ తన పేరును అబ్దుల్ కరీమ్ గా కూడా మార్చేసుకున్నాడు.

అయితే మధుబాలకు గుండెల్లో రంధ్రం ఉన్నట్లు తెలిసింది. 1954లోనే ఆమెకు ఈ విషయం తెలిసింది. అయితే కిషోర్ కుమార్ ను పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో ఆమె నటనకు స్వస్తి చెప్పింది. దర్శకత్వం చేసి ఫర్జ్ ఔర్ ఇష్క్ అనే సినిమా తీయాలని అనుకుంది. కానీ అది కుదరలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో ముంబై లోని కార్టర్ రోడ్డులో ఆమె కోసం బిల్డింగ్ కొని అందులో ఓ నర్సు.. ఓ డ్రైవర్ ను పెట్టాడు కిషోర్ కుమార్. చాలా రోజులకు ఒకసారి కూడా కిషోర్ కుమార్ ఆమెను కలవడానికి వెళ్ళే వాడు కాదట.. మధుబాల ఫోన్ ను కూడా లిఫ్ట్ చేసేవాడు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన మధుబాల ను చూడడానికి ఆమె చివరిరోజుల్లో ఒక్కరు కూడా రాలేదట. సరిగా ఆమె 36వ పుట్టినరోజు జరిగిన కొన్నాళ్ళకు 23 ఫిబ్రవరి 1969 న ఆమె మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here