అరెస్టు చేసి స్టేష‌న్‌కు తీసుకొస్తే బ‌ట్ట‌లు విప్పి కూర్చుంది! రేప్ కేసు పెడ‌తాన‌నీ బెదిరించింది!

తిరువ‌నంత‌పురం: ఓ హిజ్రాను పోలీసులు న్యూసెన్స్ కేసు కింద అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకొచ్చారు. స్టేష‌న్‌కు తెచ్చిన వెంట‌నే ఆ హిజ్రా వీరంగం ఆడింది. బ‌ట్ట‌లు విప్పి కూర్చుంది. క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లి, గోల చేయ‌డం మొద‌లు పెట్టింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని అలెప్పీలో చేసుకుంది.

అలెప్పీ న‌గ‌రంలోని ఓ బ్రిడ్జి వ‌ద్ద వాహ‌న‌దారుల‌ను అడ్డ‌గిస్తూ డ‌బ్బులు డిమాండ్ చేస్తోందంటూ అందిన ఫిర్యాదుల‌ను దృష్టిలో పెట్టుకుని అలెప్పీ పోలీసులు ఆ హిజ్రాను అరెస్టు చేశారు. న్యూసెన్స్ కేసు న‌మోదు చేశారు. ఆమెను పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

స్టేష‌న్‌కు తీసుకొచ్చిన వెంట‌నే ఆ హిజ్రా త‌న విశ్వ‌రూపాన్ని చూపింది. ఒంటిపై దుస్తులు విప్పేసింది. క‌టిక నేల‌పై ప‌డుకుంది. త‌న‌ను తాకొద్ద‌ని, తాకితే రేప్ కేసు పెడ‌తాన‌ని బెదిరించింది. దీనితో చేసేది లేక‌..పోలీసులు ఆమెను వ‌దిలేశారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్‌మీడియాలో వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియో అలెప్పీ ఎస్పీ కార్యాల‌యానికీ చేరింది. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన జిల్లా ఎస్పీ.. అలెప్పీ స్టేష‌న్ ఎఎస్ఐని స‌స్పెండ్ చేశారు. మ‌హిళా కానిస్టేబుళ్ల‌తో కాకుండా పురుషుల‌తో అరెస్టు చేయించినందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here