ట్ర‌యాంగిల్ ల‌వ్‌: అట‌వీ ప్రాంతంలో ల‌వ‌ర్ మృత‌దేహం!

భువ‌నేశ్వ‌ర్‌: ట్ర‌యాంగిల్ లవ్ స్టోరి.. ఓ యువ‌కుడి దారుణ‌హ‌త్య‌కు దారి తీసింది. తాను ప్రేమించిన అమ్మాయిని ఇంకొక‌రు కూడా ప్రేమిస్తున్నార‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఓ యువ‌కుడు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఒడిశాలోని బౌద్ధ్ జిల్లాలోని గులుగుల‌ప‌ద‌ర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌తుడి పేరు శంత‌ను క‌న్హర్‌.

మంగ‌ళ‌వారం ఉద‌యం అత‌ని మృత‌దేహం స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ల‌భించింది. అత‌ని మృత‌దేహాన్ని చూసిన స్థానికులు మ‌న్ముండా పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సోమ‌వారం రాత్రి పొలం వ‌ద్ద‌కు వెళ్లిన శంత‌ను తిరిగి రాలేదు. తెల్ల‌వారు జామున అత‌ని మృత‌దేహం స‌మీపంలో అట‌వీ ప్రాంతంలో క‌నిపించింది.

గులుగులప‌ద‌ర్ గ్రామానికే చెందిన ఓ యువ‌తిని శంత‌ను ప్రేమిస్తున్నాడు. ఆ యువ‌తి కూడా అత‌ణ్ని ప్రేమిస్తోంద‌ని, ఆమెను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిన మ‌రో యువ‌కుడు శంత‌నును హ‌త్య చేసిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here