చనిపోయాక కూడా ఒంటి మీద 65లక్షల రూపాయల బంగారం.. బంగారంతో చేసిన శవపేటిక..!

చనిపోయాక కూడా ఏమి తీసుకెళతావురా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చనిపోతూ.. పోతూ 65లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని తీసుకొని వెళుతున్నాడు. కోటీశ్వరుడైన ఈ వ్యక్తిని ఇటీవలే చనిపోయాడు.. దీంతో అతడిని సమాధి చేసేటప్పుడు కూడా ఎంతో ఇష్టమైన బంగారాన్ని అతని మీద ఉంచి వీడ్కోలు పలికారు.

వందల కోట్లకు అధినేత అయిన 33 సంవత్సరాల షెరాన్ సుకీడో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో తన భార్య ఇంటి ముందు కాల్పుల్లో చనిపోయాడు. అతడు కారులో ఉండగా కాల్చి వెళ్ళిపోయారు. దీంతో బాధతో అతడి కుటుంబసభ్యులు అంతిమయాత్రను నిర్వహించారు. అతడికి ఇష్టమైన బంగారు ఆభరణాలతో అతడి శవాన్ని అలంకరించారు. అలాగే టింబర్ ల్యాండ్ బూట్లను అతడికి తొడిగాడు. బెంట్లే కారులో అతడి శవాన్ని శ్మశాన వాటికకు తీసుకొని వెళ్ళారు. అయితే ఆ శవాన్ని పాతిపెట్టే ముందు ఆ బంగారాన్ని తీసేశారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.

పోలీసులు అతడిని ఎవరు చంపారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులే ఎవరైనా చంపి ఉంటారా అని కూడా భావిస్తూ ఉన్నారు. గతంలో కూడా సుకీడోను చంపాలని చాలా గ్యాంగ్ లు ప్రయత్నించాయి. కానీ అతడు తప్పించుకున్నాడు. రెండేళ్ళ క్రితం కూడా అతడి మీద అటాక్ జరిగిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here