పెళ్ళికి వెళ్ళి లారీలో తిరిగి వస్తున్నారు.. కలెక్టర్ చెప్పే దాకా తెలీలేదు ఎంతమంది చనిపోయారో..!

గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడ్డారు. భావనగర్ వద్దకు వహ్చిన ఓ ట్రక్కు కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటిదాకా మొత్తం 26మంది చనిపోయినట్లు కలెక్టర్ చెప్పారు. ఆ ట్రక్కులో ఉన్న వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తోంది.

భావనగర్-రాజ్ కోట్ హైవే మీదుగా ఉమ్రాలా వద్దకు ఆ లారీ వచ్చింది. ఆ సమయంలో అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో అక్కడికక్కడే 25 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గాయపడ్డ 12 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ట్రక్కు దాదాపు 60 మందితో బయలుదేరింది. చనిపోయిన వారిలో చాలా మంది పిల్లలు, మహిళలేనని తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని గాయపడ్డ వారికి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here