బాబూ కిమ్ జాంగ్.. నీ దగ్గర ఉన్న అణుబాంబులకంటే నా దగ్గర ఉన్నవి చాలా పెద్దవి..!

తాము 2017లో అమెరికాతో వ్యవహరించినట్లుగానే 2018లో కూడా ఉంటామని నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అన్నాడు. అమెరికా ఎక్కువ చేస్తే తన టేబుల్ మీద న్యూక్లియర్ మిసైల్స్ సిద్ధంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు కిమ్..! అయితే దీనిపై ట్రంప్ కూడా కాస్త సీరియస్ గానే చెప్పుకొచ్చాడు. నీ దగ్గర ఉన్న అణుబాంబులతో పోలిస్తే నా దగ్గర ఉన్న అణుబాంబులు చాలా పెద్దవని అన్నాడు ట్రంప్.

“నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్, ఇప్పుడే తన టేబుల్ పై ఎల్లప్పుడూ అణు బాంబు బటన్ ఉంటుందని చెప్పారు. ఆయనకు ఎవరైనా హితవు చెప్పండి. నా దగ్గర కూడా ఓ న్యూక్లియర్ బటన్ ఉంటుంది. అది చాలా పెద్దది, మరింత శక్తిమంతమైనది. నా బటన్ కూడా పని చేస్తుంది” అని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ పెట్టారు. వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ అణు యుద్ధానికి దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయపడుతూ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here