ఆ క‌ల్వ‌ర్టే లేక‌పోయి ఉంటే..!

న‌ల్ల‌గొండ‌: ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి రోడ్ల‌ను విస్త‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌మాదాలు మాత్రం ఆగ‌ట్లేదు. గ‌తంలో ఎదురెదురుగా వాహ‌నాలు ఢీ కొనేవి. విస్త‌ర‌ణ త‌రువాత‌.. ఆగివున్న వాహ‌నాల‌ను వెనుక నుంచి ఢీ కొట్టే ఘ‌ట‌న‌లు తీవ్రం అయ్యాయి. అలాంటిదే ఇంకో ఘ‌ట‌న‌. తెలంగాణ‌లో చోటు చేసుకుంది. స్టేజిలో ఆగివున్న టీఎస్ఆర్టీసీ బ‌స్సును వెనుక నుంచి ఢీ కొట్టిందో లారీ.

లారీ ఢీ కొట్టిన దెబ్బ‌కు బ‌స్సును డ్రైవ‌ర్ ప్రమేయం లేకుండా సుమారు 50 మీట‌ర్ల దూరం వెళ్లింది. రోడ్డు ప‌క్క‌న క‌ల్వ‌ర్ట‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఆ క‌ల్వ‌ర్టే లేకపోయి ఉంటే రోడ్డు ప‌క్క‌న బోల్తా ప‌డి ఉండేదే. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. చిట్యాల మండలం వెల్మినేడు బ‌స్‌స్టేజీ వ‌ద్ద ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. అతి వేగంతో ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here