శ్రీవారికి చెందిన అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని దేశం దాటించేశారట..!

తిరుమల శ్రీవారికి చెందిన అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని దేశం దాటించేశారని రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం టీటీడీ తీరు ఏ మాత్రం బాగోలేదని.. భవిష్యత్తులో అక్కడ శ్రీవారి గుడి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుందని ఆయన మండిపడ్డారు.

పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మాట్లాడుతూ గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో తనకు తెలియదని చెప్పారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన నగల గురించి కేవలం నలుగురు అర్చకులకు మాత్రమే తెలుసని, మమ్మల్ని తొలగిస్తే ఆ నగలు గురించి అడిగే వారే ఉండరనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. టీటీడీ తీరు ఇలాగే ఉంటే, భవిష్యత్తులో ఇక్కడ ఓ గుడి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.స్వామి వారి నగలకు సంబంధించిన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నారు. నాలుగు బండలను తొలగిచండానికి 22 రోజుల పాటు పోటును ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, బండలు తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని, అసలు వాటి కింద ఏమున్నాయని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here