హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నావంటూ రిపోర్ట‌ర్‌ను లైవ్‌లో మెచ్చుకున్న యాంక‌ర‌మ్మ‌! ఆ త‌రువాత ఆమె ప‌రిస్థితి..!

ఓ టీవీ యాంకర్ ఓవ‌రాక్ష‌న్ ఆమె ఉద్యోగానికే ఎస‌రు తెచ్చిపెట్టింది. రిపోర్ట్ చేస్తోన్న రిపోర్ట‌ర్‌ను హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నావంటూ లైవ్‌లో మెచ్చుకుంది. అది కాస్తా దేశం మొత్తానికీ పాకిపోయింది. దీన్ని త‌ల‌వంపులుగా భావించిన స‌ద‌రు ఛాన‌ల్ యాజ‌మాన్యం ఆ యాంక‌ర‌మ్మ‌ను స‌స్పెండ్ చేసింది. కువైట్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. ఆమె పేరు బసిమా.

కువైట్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు సంబంధించిన విష‌యాల‌ను రిపోర్ట‌ర్ లైవ్‌లో రిపోర్ట్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కెమెరా ముందుకు వ‌చ్చేస‌రికి కాస్త బెరుకు ప్ర‌ద‌ర్శించిన ఆ రిపోర్ట‌ర్ త‌న సంప్ర‌దాయ త‌ల‌పాగాను స‌ర్దుకున్నాడు. అది కూడా లైవ్‌లో టెలికాస్ట్ అయ్యింది.

దీన్ని చూసిన యాంక‌ర్‌.. `నువ్వు హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నావు. ఇంకెందుకు స‌ర్దుకోవ‌డం..` అంటూ మెచ్చుకుంది. అదే ఆమె చేసిన పొర‌పాటు. సరదాగా ఆమె చేసిన ఓ చిన్న కామెంట్ దేశం మొత్తం పాకిపోయింది. ఓ లోకల్ ఎంపీకి ఆ విషయం తెలియడంతో.. ఆయ‌న దీన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

దీనితో- ఆమెను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని టీవీ యాజమాన్యాన్ని సూచించింది ప్ర‌భుత్వం. వెంట‌నే దాన్ని అమ‌లు చేసిందా టీవీ ఛానల్ యాజమాన్యం. ప్ర‌స్తుతానికి తాత్కాలికంగా ఆమెను స‌స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ.. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలుసుకుని, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here