తాను లైవ్ లో ఉన్నానని తెలియని రిపోర్టర్.. ఎంత కంగారో..!

కొన్ని కొన్ని సార్లు టీవీ రిపోర్టర్లు చేసే పనులు మనకు తెగ నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి. వాటినే బ్లూపర్లు అంటారు. సాధారణంగా లైవ్ లో ఇలాంటి బ్లూపర్లు జరగడం చాలా తక్కువ. ఒక్కసారి అలాంటివి జరిగాయంటే బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఓ లేడీ రిపోర్టర్ లైవ్ లో ఉన్నానని తెలియక తెగ కంగారు పడింది. లైవ్ లోనే తన కోట్ ను తీసివేసి.. వెనుకాల ఉన్న పొదల్లోకి వేసేసింది. రష్యా కు చెందిన టీవీ జర్నలిస్ట్ మారియా ర్యబోవా లైవ్ తెలీకాస్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంది. లైవ్ కు ముందు ఆమె తన ఒంటి మీద ఓ కోట్ ను వేసుకొంది. ఎప్పుడైతే తాను లైవ్ లో ఉన్నానని తెలుసుకుందో తెగ కంగారుపడిపోయింది. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ‘కోట్ తీసెయ్.. దాన్ని కిందకు విసిరేయ్’ అనగానే ఆమె వెంటనే చకచకా ఆ పనులు చేసేసింది. లైవ్ లో మాట్లాడడం మొదలుపెటింది. ఆ తర్వాత ఈ వీడియో గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్క సారిగా మారియా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కొందరు కోట్ పైన ఉంచుకొనే మాట్లాడచ్చుగా అని కామెంట్ చేస్తే.. మరికొందరు అంత కంగారు ఎందుకు అమ్మాయి.. అని ఆమె మీద సెటైర్లు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here