ఏమిటి ఈ హీరోలు చేసేది బూడిద.. ఆ హీరోలంతా ఆసుపత్రుల్లో చూపించుకోవాలట..!

అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ సినిమా హీరోలు ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే.. ఇంతకూ ఏమి చర్చించారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కొన్ని మీడియా సంస్థలపై వేటు విధించాలని.. ముఖ్యంగా ఎవరైతే సినీ పరిశ్రమ ను తక్కువ చేసి చూపుతున్నారో వారినే అని వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీ పీపుల్ కి అందరికి తెలిసేలా షేర్ చెయ్యండి..

ఫిలిం ఇండస్ట్రీ కి సంబందించిన వాళ్ళు అందరూ హాస్పిటల్ లో చూపించుకోమంటున్న TV5 యాంకర్ గారు..Note: విషయం ఇండస్ట్రీ పీపుల్ కి తెలియాలి కాబట్టే పోస్ట్ చేశాం.. చివరిసారిగా మాత్రమే ఈ వీడియో ను చూడండి..

CM Common Manさんの投稿 2018年4月25日(水)

అయితే దీనిపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు సంబంధించిన యాంకర్ లైవ్ లో స్పందించారు. సినిమా రంగం న్యూస్ ఛానెల్స్‌ని బహిష్కరిస్తే ఒరిగేదేమి లేదు..ముందు న్యూస్ చూడటం నేర్చుకోండి అని సినిమా ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడారు ఆ యాంకర్. సొంత డబ్బాలతో సాగే ఇంటర్వ్యూలు తమకు కూడా అవసరం లేదని.. కుటుంబాలను పొగడాల్సిన అవసరం కూడా మనకు రాదని అన్నారు ఆ యాంకర్. పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి స్పందించకుండా మీడియా మీద అక్కసు వెళ్ళగక్కితే ఏమొస్తుందని ప్రశ్నించారు. ఈ హీరోలంతా మంచి సమాజంలో బ్రతికే వాళ్ళు కాదని.. మూర్ఖంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. తెలుగు నటుల్లో ఒకరికి కూడా సామాజిక బాధ్యత ఉందా అని ప్రశించారు.. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వారే సమాజం గురించి మాట్లాడుతారని చెప్పుకొచ్చారు యాంకర్. వీళ్ళను హీరోలు అనకూడదని.. జీరోలు అనాలని.. లేదంటే మైనస్ నటీనటులు అనాలని చెప్పారు ఆ యాంకర్.. ఏమిటి ఈ హీరోలు చేసేది బూడిద.. బయట ఒకరు వచ్చి గుద్దితే హీరోలు దేనికీ పనికి రారట.. ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండిరా నాయనా అంటూ ఏది పడితే అది మాట్లాడారు. డాక్టర్ వద్ద కౌన్సిలింగ్ కు వెళ్ళాలని సూచించారు.

ఆ యాంకర్ గారు వచ్చిన షో.. బిజినెస్ విత్ బ్రేక్ ఫాస్ట్.. కానీ ఏమిటేమిటో మాట్లాడేశాడు. ఇంకా హీరోల మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకోలేదని.. కానీ ఏది పడితే అది మాట్లాడేశాడని.. మంచు మనోజ్ ఈ అంశంపై ట్వీట్ కూడా చేశారు. ఇదే టీవీ ఛానల్ లోనే ఓ పెద్ద యాంకర్ ను పోసాని కృష్ణ మురళి చెడుగుడు ఆడుకున్నాడు. అంతేకాకుండా హీరోయిన్ల గురించి కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.. అలాంటి ఆ టీవీ ఛానల్ ఆ యాంకర్ పై ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా.. ఇప్పుడేమో నీతులు చెబుతోంది అని నెటిజన్లు మాట్లాడుతున్నారు.

https://twitter.com/HeroManoj1/status/989164440439345152

https://twitter.com/IamMegaKriSH/status/989178298595926016

https://twitter.com/abhilashrao3/status/989186164174176256

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here