సెక్స్ వీడియోలో క‌నిపించాడు..న‌ది ఒడ్డున దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు!

భువ‌నేశ్వ‌ర్‌: న‌గ‌రంలోని కువాఖ‌య్ న‌ది ఒడ్డున రెండు రోజుల కింద‌ట ల‌భించిన మృత‌దేహం కేసులో స‌రికొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ ట్విస్ట్ పోలీసుల‌ను కూడా ఉలిక్కిప‌డేలా చేసింది. కొద్దిరోజుల కింద‌టే లీక్ అయిన సెక్స్ వీడియోలో క‌నిపించిన వ్య‌క్తిగా అత‌ణ్ణి గుర్తు ప‌ట్టారు పోలీసులు. అత‌ని పేరు ఉన్మ‌య్ ప‌ధీ.

భువ‌నేశ్వ‌ర్‌లోని ర‌సూల్‌గ‌ఢ్‌లో నివాసం ఉండేవాడ‌ని చెప్పారు. ఈ కేసులో ఉన్మ‌య్ ప‌ధీ సోద‌రుడే హంత‌కుడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అత‌ణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్మ‌య్‌తో పాటు సెక్స్ వీడియోలో క‌నిపించిన మ‌హిళ‌ను కూడా పోలీసులు విచారించారు. ఈ హ‌త్య‌లో త‌న ప్ర‌మేయం లేద‌ని ఆమె వెల్ల‌డించిన‌ట్లు చెప్పారు.

రెండు రోజుల కింద‌ట పోలీసుల‌కు ఈ మృత‌దేహం ల‌భించింది. మొద‌ట అనాథ మృత‌దేహంగా కేసు న‌మోదు చేసుకున్నారు. సంఘ‌ట‌నాస్థ‌లం నుంచి క‌త్తి, బైక్‌, మ‌హిళ‌లు ధ‌రించే చెప్పు, ల్యాప‌టాప్‌, ఛార్జ‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మ‌ట్టిలో క‌ప్పి పెట్టిన మార‌ణాయుధాన్ని గుర్తించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనిపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here