సరస్వతి మామూలు కి’లేడీ’ కాదు.. మరో షాకింగ్ నిజం బయటకు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీలలో నవ వధువు సరస్వతి.. ఆమె భర్తను ప్లాన్ చేసి చంపేయించడం ఒకటి. ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్.. ఇలా రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేసులో సరస్వతి, ఆమె ప్రియుడు శివ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. పెళ్ళి కాకముందే చంపేయడానికి ప్లాన్ వేసిందట ఈ కిలేడీ..! 25 వేలు అడ్వాన్స్ ఇచ్చి ఈ ప్లాన్ అమలు చేయడానికి ఎదురుచూసిందట ఇన్నాళ్ళూ..!

విజయనగరం ఎస్పీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి నిందితురాలు బెంగళూరు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ప్రియుడు శివతో కలిసి పెళ్లికి ముందే రూ.25 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి హత్యకు కుట్ర పన్నినట్టు వివరించారు. ఈ సొమ్మును మొబైల్ యాప్ ద్వారా పంపారని తెలిపారు. ఒప్పందం చేసుకున్న ముఠా తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు విజయనగరానికి చెందిన మరో ముఠాతో డీల్ కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here