వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకొని దినేష్ కార్తీక్ గురించి మాట్లాడని మురళీ విజయ్.. నెటిజన్లు బాగా తిట్టారు..!

నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. అందుకు కారణమైన దినేష్ కార్తీక్ ను ప్రతి ఒక్కరూ పొగిడారు. అయితే భారత టెస్టు జట్టు సభ్యుడు మురళీ విజయ్ మాత్రం దినేష్ కార్తీక్ గురించి ప్రస్తావించకుండా ట్వీట్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు.. వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకొని మురళీ విజయ్.. ఈ కామెంట్లు చేశాడని నెటిజన్లు దుయ్యబట్టారు. ఇద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. అందుకు కారణం దినేష్ కార్తీక్ మొదటి భార్యను మురళీ విజయ్ పెళ్ళి చేసుకోవడమే..! అందుకే అతడు చేసిన ట్వీట్ లో కనీసం దినేష్ కార్తీక్ ను ట్యాగ్ కూడా చేయలేదు.

దినేశ్ కార్తీక్ గురించి ప్రస్తావిస్తావ్ అనుకున్నాం. కానీ నువ్వు బీసీసీఐ గురించి ట్వీట్ చేశావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో దినేశ్ కార్తీక్ తమిళనాడుకి విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఫైనల్లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు ట్రోఫీ అందించాడు. అప్పుడు కూడా విజయ్ అతడి పేరును ప్రస్తావించలేదంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది క్రికెట్ వర్గాల్లో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here