వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టడానికి వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని మల్యాలలో గురువారం చోటు చేసుకుంది. మృతులను చందు, రియాన్గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరి మృతితో మల్యాలలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.