అతివేగం..నిద్ర‌మ‌త్తు! దీని ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే!

చిత్ర‌దుర్గ‌: క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారును లారీ ఎదురుగా ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని హిరియూర్ తాలూకా య‌ర‌బ‌ళ్లి గ్రామ స‌మీపంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. మృతుల‌ను అఫీసా, అజ్మ‌ల్ పాషాగా గుర్తించారు.

బ‌ళ్లారి నుంచి తుమ‌కూరుకు వెళ్తోన్న కారు య‌ర‌బ‌ళ్లి గ్రామ స‌మీపంలో బైపాస్ రోడ్డుపై వెళ్తుండ‌గా.. ఎదురుగా వ‌చ్చిన లారీ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో అఫీసా, అజ్మ‌ల్ పాషా అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. ఆఫీసా త‌ల చిట్లిపోయింది. మ‌రో ముగ్గ‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని బెళ్ల‌కెరె తాలూకా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఐమంగ‌ల పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here