కాకిబంగారంతో కోట్లు రూపాయ‌లు వెన‌కేసుకున్నారు..!

అబుధాబి: గ‌ల్ఫ్ దేశాలు. నాణ్య‌మైన బంగారానికి పెట్టింది పేరు. 24 క్యారెట్ల బంగారం ల‌భిస్తుంద‌క్క‌డ‌. అలాంటి చోట‌.. కాకి బంగారంతో కోట్ల రూపాయ‌ల‌ను వెన‌కేసుకున్నారు ఇద్ద‌రు ఘ‌రానా దొంగ‌లు. శ‌తాబ్దాల కింద‌ట భూమిలో పాతిపెట్టిన బంగారం త‌మకు దొరికింద‌ని కాక‌మ్మ క‌బుర్లు చెబుతూ కాకి బంగారాన్ని అంట‌గ‌ట్టారు.

దీనిపై బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంలో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌ల‌ప‌న్ని మ‌రీ ఆ ఇద్ద‌ర్నీ ప‌ట్టుకున్న పోలీసులు వారి నుంచి మూడు కేజీల కాకి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారాన్ని చూపించి, కొనుగోలుదారుల‌ను బుట్ట‌లో వేసుకుంటారు. ఇలాంటి బంగారం త‌మ‌కు పురావ‌స్తు త‌వ్వ‌కాల్లో ల‌భించింద‌ని, త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యిస్తామ‌ని ఆశ‌పెడ‌తారు. షార్జా పారిశ్రామిక వాడ‌లో ఓ చిన్న త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అస‌లు బంగారాన్ని చూపించి.. కాకి బంగారాన్ని అంట‌గ‌ట్టారు.

60 వేల దిర్హామ్‌ల‌ను పెట్టి కొన్ని బంగారు నాణేల‌ను కొనుగోలు చేశాడా పారిశ్రామిక‌వేత్త‌. తీరా చూస్తే- అవి ఇనుముతో చేసిన నాణేలు. వాటిపై బంగారు రంగును పూసిన‌ట్టు తేలింది. వెంట‌నే ఆయ‌న షార్జా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీఐడీకి బ‌ద‌లాయించారు.

రంగంలో దిగిన సీఐడీ అధికారులు ఇద్ద‌ర్నీ వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు.  వారి నుంచి మూడు కేజీల బంగారాన్ని, న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లు సీఐడీ డైరెక్ట‌ర్ క‌ల్న‌ల్ ఇబ్ర‌హీం ముసాబా చెప్పారు. ఇలాంటి వారిని న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే బంగారాన్ని కొనాల‌ని సూచించారు.

ليس كل ما يلمع ذهبا !! يعرضان للبيع قطعا معدنية مصقولة على أنها ذهب و شرطة الشارقة تضع حدا لمغامراتهما . . تمكنت اجهزة التحريات والمباحث الجنائية بالقيادة العامة لشرطة الشارقة من القبض على شخصين من الجنسية الاسيوية وبحوزتهما كمية من القطع المعدنية المذهبة يبلغ وزنها 3 كيلوجرامات كانا يقومان بعرضها للبيع على أنها ذهب حقيقي من خلال الاتصال ببعض الأشخاص وإيهامهم بانهما يملكان كمية من الذهب عثرا عليها باحد المواقع الأثرية ، وعند حضور المشتري يقومان بتسليمه قطعة صغيرة من الذهب الحقيقي على انها عينة من الكنز الذي بحوزتهما مقابل مبلغ يتفق عليه ، وبعد تحديد المبلغ المطلوب لبيع الكمية المتبقية من الذهب يتفقا معه على إحضار المبلغ واستلام الكمية في إحدى المناطق الصناعية بالشارقة حيث يقومان باستلام المبالغ التي تتراوح بين خمسين وستين ألف درهم ، وتسليمه مغلفا يحتوي كمية من القطع الذهبية التي يكتشف لاحقا انها مجرد قطع حديدية مصقولة باللون الذهبي . وتمكن المذكوران بهذا الأسلوب الاحتيالي من الإيقاع ببعض الضحايا ، قبل ان يقوم أحدهم بالإبلاغ عن تعرضه للنصب والاحتيال من قبل مجهولين ، حيث تم تشكيل فريق من رجال التحريات والمباحث الجنائية بشرطة الشارقة لمتابعة القضية ، وبالبحث والتحري تمكن الفريق من تحديد هوية المحتالين ، ومعرفة مكان تواجدهما والقبض عليهما وبحوزتهما الكمية المشار إليها من القطع المعدنية المذهبة .. وبالتحقيق معهما فقد اعترفا بتورطهما في القضية المشار اليها . وحذر العقيد إبراهيم مصبح العاجل مدير إدارة التحريات والمباحث الجنائية بشرطة الشارقة أفراد المجتمع من الوقوع ضحية للمحتالين ، والتورط في شراء الذهب او المجوهرات من غير المحلات المعروفة والمصرح لها بتجارة الذهب والمجوهرات والمعادن الثمينة والحصول على فواتير لمشترياتهم ، كما حذر أصحاب المحلات العاملة في هذه التجارة من شراء الذهب أو المجوهرات والمصوغات الذهبية من أشخاص لا يملكون سندا قانونيا أو فواتير شراء لهذه المقتنيات تفاديا للوقوع ضحية للنصب والاحتيال ، وطالب مدير إدارة التحريات والمباحث الجنائية أفراد الجمهور بضرورة الإبلاغ فورا عن أي محاولة للقيام بمثل هذه الأعمال مشيرا إلى قيام بعض المحتالين باللجوء لمختلف الحيل والأساليب في الإيقاع بضحاياهم واستدراجهم للوقوع في فخ جرائمهم .

A post shared by شرطة الشارقة (@shjpolice) on

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here