నంది విగ్ర‌హం కింద నిధి ఉంద‌నే అనుమానం..

రాయ‌చూరు: గుప్త నిధి కోసం ఇద్ద‌రు వ్య‌క్తులు దుర్మార్గానికి ఒడిగ‌ట్టారు. ప్రాచీన శివాల‌యాన్ని ధ్వంసం చేశారు. శివాల‌యంలో నంది విగ్ర‌హాన్ని పూర్తిగా తొల‌గించారు. దాన్ని మ‌ధ్య‌లోకి ప‌గుల‌గొట్టారు. నంది విగ్ర‌హం కింద నిధి ఉంద‌నే అనుమానంతో దాన్ని తొల‌గించారు.

విగ్ర‌హం అడుగు భాగాన్ని త‌వ్వేశారు. అయిన‌ప్ప‌టికీ.. వారికేమీ దొర‌క‌లేద‌ని వేరేగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరు జిల్లా దేవ‌దుర్గ బెణ‌క‌ల్ గ్రామంలోని అణేలింగేశ్వ‌ర దేవ‌స్థానంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు నిందితుల‌ను గుర్తించి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై దేవదుర్గ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here