అంబులెన్స్ లో మస్కిటో కాయిల్ పెట్టుకొని పడుకున్నారు.. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు..!

మస్కిటో కాయిల్స్ వలన దోమలు దగ్గరకు రావని చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే ఆ మస్కిటో కాయిల్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. అంబులెన్స్ లో మస్కిటో కాయిల్ పెట్టుకొని నిద్రపోతున్న ఇద్దరు యువకులు బూడిదవగా.. మరొకరు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.

షేక్‌ సారాయోలోని పార్కింగ్‌ స్థలంలో సోమవారం అర్ధరాత్రి అంబులెన్సులో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్నారు. దోమలు ఎక్కువగా ఉండటంతో వారు మస్కిటో కాయిల్‌ వెలిగించి నిద్రకు ఉపక్రమించారు. అయితే గాలులు బలంగా వీయడంతో కాయిల్ వాళ్ళు పెట్టిన స్థానం నుండి మరో చోటుకు కదిలింది. దీంతో నిప్పు రవ్వలు కాస్తా అంబులెన్స్ తగులబడేలా చేశాయి. దీంతో అంబులెన్స్ వెనుకభాగంలో నిద్రిస్తున్న రాహుల్‌, గుడ్డు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ముందుభాగంలో ఉన్న డ్రైవర్‌ దీపుకు గాయాలవ్వగా.. అతడిని సఫ్జర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు.

నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పాయి. రాణా అంబులెన్స్ సర్వీస్ కు సంబంధించిన ఈ అంబులెన్స్ లో వారి ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి. చనిపోయిన వాళ్ళు అసిస్టెంట్ హెల్పర్స్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. రాహుల్ అక్కడ జాయిన్ అయి కేవలం రెండు వారాలు మాత్రమే అయిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here