ఒకే ట్రాక్‌పై రైళ్లు..ఎదురెదురుగా!

హ‌స‌న్‌: ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వ‌చ్చిన సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లా హోళెన‌ర‌సీపుర రైల్వేస్టేష‌న్‌లో చోటు చేసుకుంది. మైసూరు-తాళ‌గుప్పె ప్యాసింజ‌ర్‌, అర‌సికెరె-మైసూరు ప్యాసింజ‌ర్ ఎదురుదుగా వ‌చ్చాయి. స‌కాలంలో స్టేష‌న్ అధికారులు గుర్తించి, ప్ర‌మాదాన్ని నివారించ‌గలిగారు.

అర‌సికెరె-మైసూరు ప్యాసింజ‌ర్ హోళెన‌ర‌సీపుర స్టేష‌న్‌లో రెండో నంబ‌ర్ ప్లాట్‌ఫాంపై ఉన్న స‌మ‌యంలో అదే ప్లాట్‌ఫాంపై మైసూరు-తాళ‌గుప్పె ప్యాసింజ‌ర్ కూడా వ‌చ్చింది. ప్యాసింజ‌ర్ కావ‌డంతో అది నిదానంగా స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించింది.

దీన్ని గ‌మ‌నించిన అధికారులు వెంట‌నే లోకో పైలెట్‌కు అత్య‌వ‌స‌ర సందేశాన్ని పంపించారు. దీనితో తాళ‌గుప్పె ప్యాసింజ‌ర్‌కు కొన్ని మీట‌ర్ల దూరంలో రైలును నిలిపివేశారు. అనంత‌రం ఆ ప్యాసింజ‌ర్‌ను వెన‌క్కి తీసుకెళ్లి.. ఒక‌టో నంబ‌ర్ ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు.

 

కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు హోళె న‌ర‌సిపుర స్టేష‌న్‌లో హాల్ట్ సౌక‌ర్యం లేదు. ఫ‌లితంగా.. అవి దాదాపు 60 కిలోమీట‌ర్ల వేగంతో ఈ స్టేష‌న్ గుండా ప్ర‌యాణిస్తుంటాయి. ప్యాసింజ‌ర్‌కు బ‌దులుగా ఎక్స్‌ప్రెస్ రైలు వ‌చ్చి ఉంటే పెను ప్ర‌మాదానికి ఆస్కారం ఏర్ప‌డి ఉండేదని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here