రైలింజ‌న్ లోకో పైలెట్ల క్యాబిన్‌లో మ‌హిళ‌లు! ఎక్క‌డివారో గానీ!

గ్వాలియ‌ర్‌: రైలింజ‌న్‌లో లోకో పైలెట్ల‌కు త‌ప్ప మ‌రో వ్య‌క్తికి అక్క‌డ కూర్చునే హ‌క్కు, అధికారం లేదు. మూడో వ్య‌క్తికి తావే ఉండ‌దు. అలాంటి చోట ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని మ‌హిళ‌లు కూర్చున్నారు. గ్వాలియ‌ర్ స్టేష‌న్‌లో ఈ దృశ్యం క‌నిపించింది.

రైలింజ‌న్‌లో కీల‌క‌మైన ప్యాన‌ళ్లు, స్విచ్‌లు ఉండే క్యాబిన్ అది. కోట‌-గ్వాలియ‌ర్‌-ఇటావా మ‌ధ్య తిరిగే ప్యాసింజ‌ర్ అది. ప్యాసింజ‌రే అయిన‌ప్ప‌టికీ.. దానికి రెండు రైలింజ‌న్ల‌ను అమ‌ర్చారు. ముందున్న రైలింజ‌న్‌లో లోకో పైలెట్లు ఉన్నారు.

దాని వెనుకే అమ‌ర్చిన రైలింజన్‌లో లోకో పైలెట్లు ఎవ‌రూ లేరు. దీనితో ఇద్ద‌రు మ‌హిళ‌లు అందులో లోకో పైలెట్లు కూర్చునే స్థానాల్లో బైఠాయించారు.

వారిని దిగ‌మ‌ని చెప్పిన ప్ర‌యాణికుల‌ను ఎదురు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ విష‌యం త‌మ దృష్టికి రాగానే రైల్వే అధికారులు దీనిపై విచార‌ణకు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here