120 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తోన్న కారు బ్యాక్ టైర్ ఊడి పోతే..!

అబుధాబి: ఎక్స్‌ప్రెస్ వేపై దాదాపు 120 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తోన్న కారు బ్యాక్‌టైర్ ఉన్న‌ట్టుండి ఊడిపోతే.. ఎలా ఉంటుంది? యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ రాజ‌ధాని అబుధాబిలో అదే చోటు చేసుకుంది. అబుధాబిలో ఓ ఎక్స్‌ప్రెస్ వేపై అతి వేగంగా వెళ్తోన్న ఓ మెర్సిడెజ్ బెంజ్ కారు వెనుక కుడి వైపు ఒక‌టి ఊడిపోయింది.

 

కారు ఎక్క‌డో..టైరు ఇంకెక్క‌డో అన్న‌ట్టు త‌యారైంది. ఆ కారు ప్ర‌మాదానికి గురి కాకుండా డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టున్నాడు. టైరు లేకుండానే రెండు ఫ‌ర్లాంగుల దూరం వ‌ర‌కు వెళ్లిందా కారు. ఆ కారు రోడ్డుకు ఎడ‌మ వైపున వెళ్తోన్న స‌మ‌యంలో టైరు ఊడిపోతే.. కుడి వైపున‌కు వెళ్లి ఆగింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here