ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టి..లారీ త‌ల‌కిందులు! చెక్కు చెద‌రని గుడి!

ధార్వాడ‌: ఓ భారీ లారీ వేగంగా వెళ్తూ టైరు పేలి, అదుపు త‌ప్పింది. రోడ్డుకు స‌మీపంలో ఉన్న ఓ ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టింది. ఆ దెబ్బ‌తో ఆల‌యం ధ్వంస‌మౌతుంద‌ని భ‌య‌ప‌డ్డారు భ‌క్తులు. వారి భ‌యం..భ‌యంగానే ఉండిపోయింది.

ఆల‌యం చెక్కు చెద‌ర‌లేదు. లారీ ఢీ కొట్టిన చోట పెంకులు చెదిరిపోయాయే త‌ప్ప గుడికి ఏమీ కాలేదు. లారీ మాత్రం ప‌ల్టీ కొట్టింది. త‌ల‌కిందులైంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్వాడ స‌మీపంలో చోటు చేసుకుంది. బెళ‌గావి నుంచి ధార్వాడ‌కు బ‌య‌లుదేరిందో లారీ.

పుణే-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తూ బుధ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల స‌మ‌యంలో గ‌ర‌గ ప‌ట్ట‌ణ శివార్ల‌లోకి ప్ర‌వేశించింది. వేగంగా వెళ్తున్న స‌మ‌యంలో టైరు పేలింది. అదుపు త‌ప్పింది. నేరుగా వెళ్లి శివాల‌యాన్ని ఢీ కొట్టింది. నేరుగా వెళ్లి శివాల‌యాన్ని ఢీ కొట్టింది.

ఢీకొట్టి ఆల‌యం వెనుక వైపు ఉన్న ఓ గుంత‌లో ప‌డి ప‌ల్టీ కొట్టింది. త‌ల‌కిందులైంది. గుడి పైక‌ప్పుపై అమ‌ర్చిన కొన్ని పెంకులు చెదిరిపోయాయి. లారీ డ్రైవ‌ర్, క్లీన‌ర్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై గ‌ర‌గ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here