యు టర్న్ షూటింగ్ పూర్తి

సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. 2106 లో కన్నడలో ఘన విజయం సాధించిన ‘యు టర్న్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర లోని తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేసింది సమంత.

వచ్చే వారంలో ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పుకోనుంది. అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here