న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో స్థిరపడిన వారిలో విదేశీయుల సంఖ్య చాలా ఎక్కువ. ఉపాధి వేట కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో మనవాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. భవన నిర్మాణం సహా మౌలిక రంగాల్లో ఉపాధి పొందుతోన్న లక్షలాది మంది విదేశీయులు ఎమిరేట్స్‌లో నివసిస్తున్నారు.
అలాంటి వారి కోసం ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వారికి వేతనాలు సరిగ్గా అందకపోతే.. వెంటనే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది.
దీనికోసం ఆ దేశ కార్మిక మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ నంబర్ 800 665. ఈ నంబర్‌కు డయల్ చేసి కార్మికులు తమ వివరాలతో పాటు ఫిర్యాదులను అందజేయవచ్చని ఎమిరేట్స్ కార్మిక శాఖ అధికారులు తెలిపారు. దీనితో పాటు- www.mol.gov.ae అనే వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.