దుబాయ్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు.. 8.84కోట్ల రూపాయలు కొట్టేసి పారిపోయాడు..!

దుబాయ్ లో సెక్యూరిటీగా పని చేసే ఓ వ్యక్తి తన చేతివాటం ప్రదర్శించాడు. ఏకంగా 5మిలియన్ల దిర్హాంలను కొట్టేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. 5 మిలియన్ల దిర్హాంలంటే భారత్ కరెన్సీలో 8కోట్ల 84లక్షల రూపాయల పై మాటే. ప్రస్తుతం అతడి కోసం యుఏఈ పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు.

దుబాయ్ లో ఉన్న షాపింగ్ మాల్ లో డబ్బులు పెట్టాడానికి ఓ సెక్యూరిటీ ఏజెన్సీ పయనమైంది. అందులో ఉన్న సెక్యూరిటీ గార్డు కెన్యా జాతీయుడట. అతడితో పాటూ మరికొందరు గార్డులు ఉంటే వారిని పక్కను పంపించి వేశాడు. ఆ తర్వాత ఆ డబ్బులతో అక్కడ నుండి పారిపోయాడు. డీరాలో ఉన్న షాపింగ్ మాల్ లోని ఏటీఎం లో డబ్బులు పెట్టాడానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి 10:30 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు తాజాగా మీడియాకు వార్తను అందించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా అరుదు. ఏకంగా ఇంత మొత్తంతో డబ్బులు కొట్టేసి వెళ్ళిపోవడం నిజంగా షాకింగ్ విషయమే.. అయినా దుబాయ్ పోలీసుల నుండి తప్పించుకుపోవడం అంత సులువేమీ కాదు అని దుబాయ్ వాసులు చెబుతూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here